![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -965 లో.... దుగ్గిరాల కుటుంబాన్ని మొత్తాన్ని ప్లాన్ చేసి బాంబ్ పెట్టి చంపాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా వాళ్ళు శ్రీశైలం వెళ్లే వ్యాన్ కింద బాంబ్ పెడుతుంది. రాహుల్ రేఖ, స్వప్న ఇంకా పాప వేరే వెహికల్ లో వచ్చేలా రాహుల్ ప్లాన్ చేస్తాడు. దుగ్గిరాల కుటుంబం మొత్తం సరదాగా డాన్స్ చేస్తూ వ్యాన్ లో ఎంజాయ్ చేస్తారు. వెనకాలే కార్ లో రాహుల్ వాళ్ళు ఉంటారు. కావ్య, అప్పు వ్యాన్ ఆపి దిగి రాహుల్ దగ్గరికి వస్తారు. నిజం తెలిసి పోయిందా అని రాహుల్ టెన్షన్ పడుతాడు.
ఏమైందని రాహుల్ అడుగగా.. మేం ఎంజాయ్ చేస్తే సరిపోతుందా మా అక్క కూడా మాతో ఉండాలి కదా అని స్వప్నని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్తారు. అప్పుడే రుద్రాణితో రాహుల్ ఫోన్ లో మాట్లాడుతాడు. వ్యాన్ లోకి స్వప్న వెళ్ళిందని చెప్తాడు. వెళ్తే ఏంట్రా నువ్వు ఏమైనా దాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా ఏంటి.. ఆస్తి కావాలా.. భార్య కావాలా అని రుద్రాణి అనగానే నాకు ఆస్తి కావాలని రాహుల్ అంటాడు. స్వప్న వాళ్ళు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. రుద్రాణి బాంబ్ స్పాట్ కి వచ్చేసరికి బటన్ ప్రెస్ చెయ్యగానే వ్యాన్ కింద ఉన్న బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. దాంతో అందరు చెల్లాచెదురుగా ఎక్కడివారు అక్కడే పడిపోతారు. ఒక్క అపర్ణకి మాత్రం స్వల్ప గాయాలు అవుతాయి. తను లేచి మెల్లిగా కావ్య పాపని అప్పు పాపని తీసుకొని సుభాష్ ని లేపే ప్రయత్నం చేస్తుంది. అదంతా రేఖ, రాహుల్ చూస్తుంటారు. అపర్ణ బ్రతికి ఉండడం చూసి గన్ పట్టుకొని రాహుల్ బయటకు వస్తాడు.
ఒరేయ్ సమయానికి వచ్చావ్ రా వీళ్ళని హాస్పిటల్ కి తీసుకొని వెళదామని రాహుల్ తో అపర్ణ అనగానే గన్ తో షూట్ చెయ్యాలని రాహుల్ ట్రై చేస్తుంటాడు. అప్పుడే రాజ్ వచ్చి అడ్డుపడతాడు. ఆస్తి అడిగి ఉంటే ఇచ్చేవాడిని కదరా ఇంతలా చేస్తారా అని రాహుల్ ని రాజ్ షూట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |